సీఎం జగన్ మరోసారి తన మానవతను చాటుకున్నారు. నూజివీడులో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హెలిపాడ్ కు వెళ్లబోతుండగా, అక్యూట్ మైలోడ్ లుకేమియా, మానసిక వికలాంగత్వం పరాప్లేగియా వ్యాధి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు ముఖ్యమంత్రిని కలిసి తమ దీన పరిస్థితిని తెలియజేసి, తమను ఆదుకోవాలని కోరారు. వారి అనారోగ్య పరిస్థితుల నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నుండి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి వివరంగా అడిగి తెలుసుకున్నారు. రోగుల దీన పరిస్థితిని చూసి చలించిన ముఖ్యమంత్రి వారికి తాను అండగా ఉంటానని చెప్పి, వెంటనే వారికి అవసరమైన ఆర్ధిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో, వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగంతో తక్షణమే స్పందించి ఆపన్నులకు ఆర్ధిక సహాయాన్ని అందించారు.