అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకం అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. దీని వల్ల నెల్లూరు జిల్లాల్లో 5517 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దున్నే వాడిదే భూమి అన్నట్లు సీఎం వైయస్ జగన్ రైతులకి హక్కులు కల్పించారన్నారు. స్వయం ప్రకటిత మేధావులు అందరూ టీడీపీలోనే ఉన్నారు. వారు మాట్లాడిందే పచ్చ పత్రికలు రాస్తున్నాయి. కరువు మండలాలు ప్రకటనపై చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఎవరు వస్తారో రండి అంటూ మంత్రి సవాల్ విసిరారు. అయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి నాందిపలికే ప్రతీ సందర్భంలోనూ టీడీపీ విషప్రచారానికి పూనుకుంటుంది. ఆ పార్టీ కక్కిన విషాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే పచ్చమీడియా తపనను అందరూ చూస్తూనే ఉన్నారు. వారి కుట్రల్ని ఎప్పటికప్పుడు అర్ధం చేసుకుంటూనే ఉన్నారు. కరువు మండలాల గురించి టీడీపీ నేతలు పదేపదే విమర్శలు చేయడం.. వాటిని పత్రిక పతాక శీర్షికలుగా పెట్టి ప్రభుత్వంపై విషపురాతలు రాయడం ఇటీవల మరీ శృతిమించిపోతుంది. నిజానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నివేదికల్లోని కరువు మండలాల ప్రకటనకు సంబంధించి ప్రామాణికాల్ని చదివి అర్ధం చేసుకునే కెపాసిటీ వీరికి లేదు అని ఎద్దేవా చేసారు.