టీడీపీ బీసీ మంత్రులు జయం జయం చంద్రన్న అంటూ భజన చేశారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు అచ్చెన్నాయుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. బీసీ జడ్జీలు వద్దని అప్పట్లో చంద్రబాబు లేఖ రాసినప్పుడు ఏం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో బీసీలు మోసపోయారని గుర్తు చేశారు. టీడీపీకి రాష్ట్రంలో 175 స్థానాల్లో అభ్యర్థులు లేక బీజేపీ, జనసేన, మిగిలిన పార్టీల కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. బీసీల అభివృద్ధికి కులగణన అవసరం అంటే టీడీపీ ఎందుకు అడ్డుకుంటుందని వరుదు కళ్యాణి నిలదీశారు. రాజ్యాంగ సూచనకు మించి ఏపీలో బీసీలకు మేలు జరిగిందని చెప్పారు. బీసీలకు సీఎం వైయస్ జగన్ బ్యాక్ బోన్‌గా నిలిచారని ఆమె కొనియాడారు.