వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం కావడంతో టీడీపీ వెన్నులో వణుకుపుట్టిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి అన్నారు. రాష్ట్రంలో సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోందని తెలిపారు. సాధికార యాత్ర విజయవంతం కావడంతో టీడీపీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బస్సు యాత్ర..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జైత్రయాత్రగా చెప్పాలన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. బీసీల గురించి మాట్లాడే హక్కు అచ్చెన్నాయుడికి ఉందా అని నిలదీశారు.