అప్పటి ఏపీ హౌసింగ్ బోర్డును మోసం చేసి ఇందూ-ఏపీ హౌసింగ్ బోర్టు ప్రాజెక్టు అప్రూవల్స్ పొందారని.. తక్కువ పెట్టుబడితో ఉమ్మ డి ఏపీ సీఎం వైఎస్ తోడల్లుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎక్కువ వాటా తీసుకోవడం ద్వారా భారీగా లబ్ధిపొందారని సీబీఐ పేర్కొంది. ఇందూ-హౌసింగ్‌బోర్డు కేసులో వైవీ ఆరో నిందితుడిగా ఉన్నారు. తనపై సీబీఐ పెట్టిన కేసును కొట్టేయాలన్న క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. సీబీఐ తరఫున స్పె షల్ పీపీ ఆనంది వాదనలు వినిపించారు. సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదన లు వినిపించారు. సుబ్బారెడ్డి వైఎస్‌కి తోడల్లుడనే ఒక్క కారణంతో నేరం చేశారనే ఊహతో కేసు పెట్టారన్నారు. ఆయన లబ్ధి పొందినట్లు ఒక్క సాక్ష్యం కూడా లేదని.. కేసు చెల్లదని ఇదే హైకోర్టు అనేక తీర్పుల్లో పేర్కొందని.. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. వాదనలు నమోదు చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, వైవీ 2016లో దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే ఒకసారి విచారణ జరిగి తీర్పు రిజర్వు అయింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన అప్పటి టీ-హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ ఏడాది మార్చిలో తీర్పు రిజర్వు చేశారు. శుక్రవారం వాదనలు పూర్తికావడంతో రెండోసారి తీర్పు రిజర్వు అయింది.