ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న గరల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (గెస్ట్-2024)ను ఈ ఏడాది డిసెంబరు 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకార వేతనం అందజేస్తారు. అలాగే మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు చొప్పున, తర్వాత 15 ర్యాంకుల బాలికలకు నెలకు రూ.3 వేలు చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు అందిస్తారు. 10వ తరగతి చదువుకున్న బాలికలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆసక్తి ఉన్న బాలికలు ఈనెల 18 నుంచి డిసెంబరు 15 మధ్య ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాల వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, లేదా 7660002627/28 మొబైల్ నంబర్లతో సంప్రదించాలని భువనేశ్వరి సూచించారు.