కాకినాడ జిల్లా, కడియం మండలం బుర్రిలంకలో ఇసుక ర్యాంపును జనసేన నాయకులతో కలిసి పరిశీలించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై మేము మాట్లాడితే మాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. రుజువులతో మేము మాట్లాడితే ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదన్నారు. జేపీ కంపెనీకి అనుమతి పూర్తయిందని పురందేశ్వరి అన్నారు. రూ.48 కోట్లకు ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. పర్మిట్లపై ఎవరి సంతకం లేదన్నారు. ఒకొక్క లారీకి 30 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇసుక అక్రమ తవ్వకాలపై సమాధానం చెప్పానని పురందేశ్వరి తెలిపారు.