దేశ భవిష్యత్తు మహిళలు, యువతపై ఆధారపడి ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోంటే సీఎం జగన్ పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. సీఎం జగన్ వీధి వీధిన బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు, మహిళా సమాఖ్య వర్కింగ్ ప్రసిడెంట్ విమల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని, తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.