టీడీపీ, జనసేన సారథ్యంలో ‘‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’’ పేరిట నిరసనకు పిలుపునిస్తున్నామని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...బాహుబలిలో కుంతల రాజ్యం చూశాం, జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంతా గుంతల రాజ్యమైంది. అధ్వానస్థితిలో ఉన్న రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది. తెలుగుదేశం-జనసేన సంయుక్తంగా 18,19 తేదీలల్లో మీమీ ప్రాంతాల్లో ఉన్న గుంతలు, అధ్వాన్నరోడ్ల ఫొటోలు, వీడియోలు తీసి, హ్యాష్ ట్యాగ్‌లతో వివరాలు రాసి సోషల్ మీడియా అక్కౌంట్లలో పోస్టు చేసి.. సైకో సర్కారు మొద్దునిద్ర వదిలించండని నారా లోకేష్ పిలుపునిచ్చారు.