ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలో బీసీలకి రాజకీయ ప్రాధాన్యత లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2023, 01:01 PM

నలుగురు రెడ్లు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నడుస్తున్నాయి అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అయన మాట్లాడుతూ.... వైసీపీ పాలనలో బీసీల భాగస్వామ్యం లేదు. పెత్తందారి విధానంలో జగన పాలన సాగిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషనను కుదించడం ద్వారా రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించి, బీసీలకు సీఎం జగన తీరని అన్యాయం చేశారు. బీసీలకు పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత టీడీపీదే. సైకో పాలనకు చరమగీతం పాడాలని బీసీలంతా ఏకాభిప్రాయంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం. చంద్రబాబు సీఎం కావడం తథ్యం అని ఆశాభావం వ్యక్తపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com