సాధికార బస్సు యాత్రపేరుతో వైసీపీ నయ వంచన చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ వాపోయారు. అయన మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏమీ చేయకపోయినా బస్సు యాత్ర పేరుతో ప్రజల్లో వెళ్లడం దారుణం. వైసీపీ బస్సు యాత్ర తుస్సు యాత్రగా మారింది. బీసీల హక్కులను సీఎం జగన కాలరాస్తున్నారు. ఇసుక, మైనింగ్ దందాలతో భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికులకు జీవనోపాధి లేకుండా చేయడం దుర్మార్గం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బీసీలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అన్ని హెచ్చరించారు.