రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను జగన్ సర్కారు చిన్నచూపు చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. అవినీతి, అక్రమాలే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ విధ్వంసకర రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు హీనదశకు చేరుకున్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను కలుసుకునేందుకు అన్ని జిల్లాల్లో తాను పర్యటిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై దృష్టి లేదని రాష్ట్ర రహదారులను పరిశీలిస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు.