బాలిక ఉయ్యాల ఊగుతున్న సమయంలో మెడకు ఉరిపడి మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరం రాజీవ్ గాంధీ నగర్ 3వ లైనులో అచ్చమ్మ వద్ద మనుమరాలు బొంత కావ్య ఉంటోంది. శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో కావ్య ఉయ్యాలలో ఆడుకుంటూ మెలికలు తిరుగుతూ ఉండగా, ప్రమాదవశాత్తు మెడకు ముడిపడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆలస్యంగా గమనించారు. అరండల్ పేట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.