సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యారంగం నిర్వీర్యం అయిపోయిందని యుటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కే. జోజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పొన్నూరు జయ కుమార్ ఫంక్షన్ హాల్ లో యూటీఎఫ్ గుంటూరు జిల్లా 49వ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్ల యూటీఎఫ్ ప్రయాణంలో ఉపాధ్యాయ సంఘాలు హక్కులు సాధించుకున్నామన్నారు. ఉపాధ్యాయులు పట్టుదలతో ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.