భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్ క్రికెట్ ఈవెంట్‌లా లేదని, బీజేపీ ఈవెంట్‌లా సాగుతోందని విమర్శించారు. క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. "ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేలా ఉన్నారు" అని వ్యంగంగా విమర్శించారు.