రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పోలీస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాని మోడీ ఈ రోజు రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా విధుల కోసం పోలీస్ అధికారులు నాగౌర్ నుంచి ఝుంజునుకు వాహనంలో బయల్దేరారు. లారీని ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు సడెన్‌గా లారీ డ్రైవర్ బ్రేకులు వేశాడు. దాంతో ఈ ప్రమాదం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa