ఢిల్లీకి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి దివ్యాన్షి మూడు అంతస్తుల బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో చికిత్స కోసం తల్లిదండ్రులు ఎయిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్టు తెలిపారు. అనంతరం పాప తల్లిదండ్రులు అవయవదానానికి ఒప్పుకోవడంతో పాప గుండెను చెన్నైలో 8 నెలల పాపకి అమర్చారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న 17 ఏళ్ల బాలికకు పాప రెండు కిడ్నీలను అమర్చారు.