ముంబైలోని బార్క్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ విద్యార్థిని(19)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. క్వార్టర్స్‌లో నివాసముంటున్న యువతిని ఇంటికి పిలిపించి మత్తు మందు కలిపిన డ్రింక్‌లో తాగించారు. అనంతరం యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకుని యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు.