మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు చిరుత పులులు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాసిక్‌లోని ఓ భవనం మొదటి అంతస్తులోని ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో ఓ చిరుత పులి సరాసరి బెడ్రూంలోకి చొరబడింది. కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ట్రాంక్విలైజర్‌తో చిరుతను కాల్చి స్పృహ తప్పింది. దాంతో ఆ చిరుతను పోలీసులు పట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa