ఏపీలోని కర్నూలులో లా యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ యూనివర్సిటీకి సీఎం జగన్ చేతుల మీదుగా డిసెంబర్ లో భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. 250 ఎకరాల్లో రూ.600 కోట్లతో నిర్మించే ఈ యూనివర్సిటీ పూర్తయితే దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు న్యాయ విద్యను అభ్యసించేందుకు వీలుంటుందని త్రి తెలిపారు. కల్లూరు(M) లక్ష్మీపురంలో యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.