మహారాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంపై ఇప్పటివరకు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం కనుగొనలేదు. మరోవైపు ఓబీసీ కులాల విభజన కొత్త టెన్షన్‌ని కలిగిస్తోంది. మంత్రిగా ఉన్న ఛగన్ భుజబల్ కొత్త శిబిరానికి తెరలేపాు. ఈ శిబిరానికి ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. ఓబీసీ పేరుతో కొత్త పార్టీ లేదా ఫ్రంట్ ఏర్పాటు చేయవచ్చనే చర్చ జరుగుతోంది.