ఏపీలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు వెల్లడించనుంది. సీఐడీ, చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు విచారణ చేపట్టగా.. కోర్టు జారీ చేసే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.