ఉత్తరాఖండ్లో టన్నెల్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. మోదీ స్వయంగా సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి కార్మికుల యోగక్షేమాల గురించి అడిగారు. సహాయ చర్యల గురించి కూడా వివరాలు అడిగి తెలసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం అవసరమైన యంత్ర సామగ్రితో పాటు సిబ్బంది, ఇతర వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని ప్రధాని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సహాయ చర్యలు మరింత వేగవంతం చేయాలని సూచించారు.