ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు బోయినపల్లి అభిషేక్ బెయిల్ కేసును సుప్రీంకోర్టు డిసెంబర్ 4కు వాయిదావేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, బెయిల్ ఇవ్వాలని అభిషేక్ వేసిన పిటిషన్పై జస్టిస్ సంజయ్కన్నా, జస్టిస్ ఎస్ఎన్విభట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో సెక్షన్-19పై లోతుగా విచారణ చేస్తామని, ఈలోగా ఇరుపక్షాలు తమ ప్లీడింగ్స్ పూర్తిచేయాలని ఆదేశించింది.