ఢిల్లీలో ఓ రెండేళ్ల చిన్నారి తాను చనిపోతూ మరో ఇద్దరికి పునర్జన్మనిచ్చింది. దివ్యాన్షి(2) అనే బాలిక మూడంతస్తుల భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడింది. చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించగా ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురైందని వైద్యులు తెలిపారు. అవయవదానానికి తల్లిదండ్రులను ఒప్పించారు. బాలిక గుండెను 8 నెలల పాపకు, కిడ్నీలను 17ఏళ్ల బాలికకు అమర్చారు. కళ్లను ‘ఐ’ బ్యాంక్‌లో భద్రపరిచారు.