ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు యుద్ధప్రాతపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఐదు ప్రణాళికలను రూపొందించగా.. వాటికి కార్యరూపంలోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల బృందం స్కిలియారాలోనే ఉండి పర్యవేక్షిస్తోంది. ఆదివారం రాత్రి నుంచే డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించగా.. అవి కొనసాగుతున్నాయి.