వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. సామాజిక సాధికార యాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. ఈ రోజు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎలమంచిలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం. మధ్యాహ్నం 2:30 గంటలకు వైయస్ఆర్ విగ్రహం నుంచి అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ. మధ్యాహ్నం 3:30 గంటలకు అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్లో బహిరంగ సభ. మంత్రులు ధర్మాన ప్రసాద్, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ, రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, తదితరులు సభకు హాజరు కానున్నారు.