బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ) పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది జూలై 8న రైతు దినోత్సవం కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరాల జల్లుతో బీటీపీ పనులు ముందుకు కదిలాయి. ప్రాజెక్టు పనులతో దుర్గం రైతుల ఆకాంక్ష నెరవేర నుంది. దీంతో కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజక వర్గాల్లో ప్రజల దాహార్తితో పాటు రైతుల సాగు కష్టాలు తీరనున్నాయి.