శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని పోచంపల్లి బ్రిడ్జిలు వెంటనే నిర్మించాలని జనసేన మరియు టిడిపి ఆధ్వర్యంలో పోచనపల్లి బ్రిడ్జి దగ్గర సోమవారం నిరసన వ్యక్తం చేశారు.టిడిపి జనసేన నాయకులు మాట్లాడుతూ పోచనపల్లి కి ప్రధాన రహదారి లో ఉన్నటువంటి కల్వర్టు ను త్వరగా నిర్మించాలని, కల్వర్టు తెగిపోయి రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని విమర్శించారు.