స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వియ్-కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం గడువును మరోసారి పొడిగించింది. సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని ఎస్‌బీఐ తెలిపింది. ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధికి అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఎస్‌బీఐ ఇవ్వనుంది. కొత్తగా డిపాజిట్‌చేసే వారు, రెన్యువల్స్‌పై ఈ పథకాన్ని పొందొచ్చు.