ధర్మవరం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ ఔట్ సోర్సింగ్ కార్మికులు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్ రావు పిలుపు మేరకు నవంబర్ 20, 21వ తేదీన రెండు రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి కు వినతి పత్రం అందించారు.