ఒంగోలులో ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాబోయే రోజుల్లో తీసుకోవలిసిన నిర్ణయాలపై బీజేపీ పార్టీ శ్రేణులకు జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ దిశా నిర్దేశం చేసారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షత వహించారు. రాబోయే ఎన్నికలలో పార్టీ సభ్యులు మరియు కార్యకర్తలు తీసుకోవాలసిన బాధ్యతలపై చర్చించినట్లు ఆమె తెలిపారు.