కందుకూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి ఇంచార్జ్ నాగేశ్వరావు సోమవారం పోతురాజుమిట్ట ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ అరాచకాలపై గట్టిగా ప్రశ్నించాలని పార్టీ అండగా ఉంటుందని నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. ముస్లింల ఫై జరుగుతున్న అన్యాయాలపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి మద్దతు పలకాలన్నారు.