సిఎస్ పురం మండలంలోని అంబవరం కొత్తపల్లిలో వెలిసిన ప్రముఖ శైవక్షేత్రం భైరవకోనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి కార్తీక సోమవారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భైరవకోన ను సందర్శించి జలపాతంలో స్నానమాచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నాగరేశ్వర త్రిముఖ దుర్గాదేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.