త్రిపురాంతకం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం డాక్టర్ నాగేశ్వరావు నాయక్ కు వినతి పత్రం అందజేశారు. వైద్యశాలలో పనిచేస్తున్న సిహెచ్ ఓ ల సమస్యలు మరియు ప్రతి నెల జీతాలు వచ్చేలా చూడాలని ఆయనకు వినతిపత్రం ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైద్యశాలలలో పని చేస్తున్న సిహెచ్ ఓ ఉన్నారు.