విద్యాలయానికి సరి సమానమైందే గ్రంథాలయమని కారంచేడు ఎంఈఓ -2 మొలబంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్కూళ్ళు విద్య నేర్పిస్తే గ్రంథాలయాల వల్ల లోకజ్ఞానం సమకూరుతుందని ఆయన చెప్పారు. కారంచేడు శాఖా గ్రంధాలయంలో సోమవారం జరిగిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎంఈఓ సత్యనారాయణతో కలిసి మొలబంటి విచ్చేశారు. వివిధ పోటీల్లో విజేతలకు వారు బహుమతులు అందజేశారు. గ్రంథ పాలకుడు నాగయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.