పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. నిర్ధిష్ట సమాచారం మేరకు తార్న్ తరణ్‌లోని మెహదీపూర్ గ్రామ శివార్లలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా హెరాయిన్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించే పాకిస్థానీ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.