సినీ నటుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థేకాదని, కాపు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని వైయస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ విజ్ఞప్తి చేశారు. కులగుణనకు సంబంధించి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలోనే నిర్వహించారు. బీసీ సంఘాల నేతలు నుంచి అన్ని కులాల కుల సంఘాల దగ్గరనుంచి అభిప్రాయాలు సేకరించాం. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ..రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ కులగణన పూర్తిస్థాయిలో జరిగిన దాఖలు లేవు.. ప్రతి కులానికి ఎంత మంది జనాభా వున్నారు, అందరికీ ఫలాలు అందుతున్నాయా లేదా అన్న విషయం కులగణన ద్వారా తెలుసుకోవచ్చు.. అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు సమానంగా అందించవచ్చు అన్నారు.