చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని, కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా చూపించడం లేదని, ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మెడికల్ బెయిల్.. రెగ్యులర్ బెయిల్‌గా మారితే సత్యం గెలిచినట్లా అని ప్రశ్నించారు. స్కిల్ స్కామ్‌తో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన చంద్రబాబు నిర్దోషి కాదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగిందో ఆధారాలున్నాయి. ఆధారాలన్నీ సీఐడీ తరపు లాయర్లు కోర్టులో సమర్పించారని చెప్పారు.