విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం కారణంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి సహాయం ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80శాతం మేర పరిహారంగా అందించాలని ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై ఈ ఉదయం జరిగిన సమావేశంలో సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు సహా జిల్లాకలెక్టర్ ఘటనాస్థలానికి వెళ్లారన్నారు. బాధితులకు పూర్తి భరోసానిచ్చామని వివరించారు. ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా, మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు.