వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ...జగనన్న కటౌట్ పెడితేనే ఇంత మంది తరలివచ్చారంటే...ఆయనపై మీకెంత అభిమానం ఉందో అర్థమవుతోంది. కడపలోని ప్రతి గడప గర్వపడేలా నాడు వైఎస్సార్, నేడు జగనన్న పాలన చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు రాష్ట్రానికి జగనన్న. నాడు–నేడు పేరిట వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 96శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తోంది. జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, ఫించన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, షాదీతోఫా, జగనన్న తోడు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సంక్షేమ పథకాలు మనకోసం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశలో నడిపిస్తూ..ముందుకు తీసుకెళుతున్నారు జగనన్న అని తెలియజేసారు.