వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ..... చంద్రబాబు హయాంలో బీసీలను తొక్కి పడేసారని, ఏ రోజునా న్యాయం చేయలేదని గుర్తు చేసారు. జగన్ సీఎం అయిన తర్వాత అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చారని కేబినెట్ లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లకు మంత్రి పదవులు, 4 రాజ్యసభ సీట్లు ఇచ్చారని, వెనుకబడిన వర్గాల పట్ల ఆయనకున్న ప్రేమకు ఇదే నిదర్శనమని వివరించారు. స్వర్గీయ వైఎస్ఆర్ ఆనాడు చేసిన ఆలోచనలతో యలమంచిలి నియోజకవర్గంలో సెజ్ ఏర్పాటు చేయగా, ఇప్పుడు జగన్ హయాంలో సుమారు 200 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండటంతో స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కన్నబాబు వెల్లడించారు. దీని కారణంగా నియోజకవర్గం విస్తృతంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఎకరం కోటి రూపాయలకు తక్కువకు ఎక్కడా భూమి దొరకని పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో పురోగతి సాధించామో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.