వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ..... టీడీపీ గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేయగా, జగన్ మాత్రం సీఎం అయిన వెంటనే రైతులకు, మహిళలకు, వృద్ధులకు, యువతకు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చారని గుర్తు చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజాప్రతినిధులను ఉప ముఖ్యమంత్రులను చేసిన జగన్ కు ఆయా వర్గాలన్నీ రుణ పడి ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.