ఈ గ్రంథాలయం గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని పావ్డి అనే మారుమూల గ్రామంలో ఉంది. గిరిజన ప్రాంతం కావడంతో మౌలిక సదుపాయాలు తక్కువ ఉన్నాయి. దీంతో గ్రామస్తులు అద్భుతమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా గ్రామానికి చెందిన 19 మంది విద్యార్థులు ఏడాదిలోపే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. విద్యార్థులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో గ్రామస్తులు 2017లో ఈ గ్రంథాలయాన్ని స్థాపించారని లైబ్రరీ వ్యవస్థాపకుడు సంజయ్ భాబోర్ తెలిపారు.