వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. జగనన్న అన్నీ చేసి చూపించాడు. సాధికారతకు నిలువెత్తు సాక్ష్యం వేదికపై ఉన్నమేమే. మాదిగ సామాజికవర్గానికి చెందిన నన్ను మంత్రిగా చేశారు. మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఉపముఖ్యమంత్రిగా, వెనుకబడిన వర్గాల వారిని మంత్రులుగా చేశారు. ఎప్పుడూ చూడని కొన్ని కులాలను చట్టసభల్లోకి తెచ్చిన ఘనత జగనన్నది. డప్పు, చర్మకారుల పింఛన్లు, నేతన్న నేస్తం లాంటివి బడుగు బలహీన వర్గాల కోసం తెచ్చారు. ఇది కాదా సాధికారత? జగనన్న అంటే నమ్మకానికి కేరాఫ్ అడ్రస్. విశ్వసనీయతకు చిరునామా. చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు. కోర్టులలో40–45 స్టేలు తెచ్చుకున్నాడు. అవినీతి రహితంగా, పారదర్శకంగా జవాబుదారీతనంతో సమర్థంగా పాలించే జగనన్న వచ్చాడు కాబట్టి బాబు ఆటలు సాగలేదు. పవన్ పెత్తందారీ పోకడలు మానుకోవాలి. ఇంగ్లీషు మీడియం మీ పిల్లలే చదవాలా? తెలుగుభాష కాపాడే బాధ్యత దళితులదా? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఇంగ్లీషులో మాట్లాడుతున్న పరిస్థితి. పవన్.. సినిమాల్లో డైలాగులు కాదు, ప్రభుత్వ పాఠశాల్లలో చదివిన పేద పిల్లలతో నువ్వు వచ్చి ఇంగ్లీషులో మాట్లాడగలవా? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మన విధానాలు హామీలుగా ఇస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు.