వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ... ఈ నాలుగున్నరేళ్లలో మనకు జరిగిన మేలు గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. గతంలో చంద్రబాబు ఐదేళ్లకాలంలో ఏం చేశారో ఆలోచించండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించాడా? నాడు బాబు కేబినెట్లో ఎస్సీ మంత్రి లేడు, మైనార్టీ మంత్రి లేడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు బలహీనవర్గాలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చారు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో బడుగు,బలహీన వర్గాలకు సమున్నత గౌరవం దక్కింది. సంక్షేమ పథకాల ద్వారా జిల్లాలో రూ.12,061 కోట్ల లబ్ధి చేకూరింది.– అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.7,984.48 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా అందాయి అని తెలిపారు.