ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో గత 30 సంవత్సరాలలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి చేశామని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ... వారి సహకారంతో అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలం నుంచే కదిరి ప్రజల స్వప్నంగా మిగిలిపోయిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి రూ.230 కోట్లతో త్వరలోనే పూర్తి చేయబోతున్నమన్నారు. కాలేజీ సర్కిల్ నుంచి చావడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేశాం, కదిరి మున్సిపాలిటీలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించాం, 18 కోట్ల రూపాయలతో స్థానిక ఏరియా ఆసుపత్రి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్ ను నిర్మించాం, ప్రతి వార్డులో ఇంటర్నల్ రోడ్లను వేసాం, గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షలతో పనులు చేపట్టమన్నారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి 150 గ్రామాలకు తారు రోడ్లు, సిమెంట్ రోడ్లను అప్రోచ్ రోడ్లను వేసామన్నారు. 63 సచివాలయాల పరిధిలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలను, వెల్నెస్ సెంటర్లను నిర్మించాం, నిర్మించుకోబోతున్నామన్నారు.