వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ... ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. ఇన్నేళ్లపాటు సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగానే మిగిలిపోయింది. కానీ మన రాష్ట్రంలో జగనన్న పాలన వచ్చాక సామాజిక సాధికారత అన్నది ఒక విధానంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులంతా ఒకే వేదికపైకి ఎక్కడం, మాట్లాడటం మన మెప్పుడైనా చూశామా? ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగనన్న చలవ వల్లే ఇది సాధ్యమైంది. మైనారీల్టకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం చంద్రబాబుది. ఈరోజు జగనన్న వల్ల నలుగురు మైనార్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నన్ను మంత్రిని చేశారు. ఉపముఖ్యమంత్రిని చేశారు. గత ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఒక మైనార్టీ ఉన్నాడు. మైనార్టీ సామాజికవర్గానికి అనేక రకాలుగా ...ఎంతో మేలు చేసిన జగనన్నను మళ్లీ గెలిపించుకోవడం మన బాధ్యత, కర్తవ్యం. ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన బతుకులు బాగుంటాయి. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని పిలుపునిచ్చారు.