ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానున్న ఎన్నికల్లో టీడీపీ, పవన్‌ కల్యాణ్‌ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 11:03 AM

వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్ మాట్లాడుతూ.... ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు.. పవన్‌ కల్యాణ్‌కు 10 మంది వస్తే 100 మంది వచ్చారని, , చంద్రబాబుకు నలుగురు వస్తే 400 మంది వచ్చారని చూపుతారు. సాధికార యాత్రకు ఇన్ని వేల మంది వస్తుంటే మాత్రం చూపించరు. జగనన్న తయారు చేసిన సైనికులు వస్తేనే ఇంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వచ్చారంటే జగనన్న బయటకు వస్తే టీడీపీ, పవన్‌ కల్యాణ్‌ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. చంద్రబాబు అంటే మోసం, వెన్నుపోటు, 420. ఇది జనంలోకి వెళ్లిపోయింది. జగనన్న అంటే మా నమ్మకం, మా అందరినీ బాగు చేసే పనిషి. పైన దేవుడు దాని తర్వాత మా తలరాతలు మార్చే వ్యక్తి ముఖ్యమంత్రి జగనన్న. ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ చేయాలని చూస్తున్నారు. పేద పిల్లలకు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకుంటే కోటి రూపాయలైనా ఫీజు కడతానన్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్‌ మాత్రమే. ఆ కాలంలో సోషల్‌ మీడియా లేదు కాబట్టి ఈనాడు ఏది చెప్తే అది చెల్లింది. చంద్రబాబూ 10 స్కూళ్లయినా కట్టించావా? జగనన్న ఆధ్వర్యంలో వేలాది స్కూళ్లను బాగు చేశారు అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com