శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 64 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. విశాఖపట్నం-కొల్లం, నర్సాపూర్-కొట్టాయం, శ్రీకాకుళం రోడ్-కొల్లం, సికింద్రాబాద్-కొల్లం, కాచిగూడ-కొల్లం, కాకినాడ-కొట్టాయం మధ్య నడవనున్నాయి. ఈ రైళ్లలో జనరల్ బోగీలతో పాటు స్లీపర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ కోచ్ లు ఉంటాయి.